CTR: పాలసముద్రం (M) ఎస్కేఆర్ పురం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. ఆరు నెలలుగా తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. నీటి కోసం ప్రస్తుతం కిలోమీటరు దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
నీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్థులు


