హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేగంగా పెదపేట రామాలయ పునర్నిర్మాణ పనులు

WG: ఆకివీడు పెదపేటలోని రామాలయ పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామరాజు ఆదేశాలతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఆలయం గుమ్మం ముహూర్తం పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు మోటుపల్లి ప్రసాద్, గంధం ఉమా, తదితరులు పాల్గొన్నారు.