హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెడనలో ఈనెల 19న జాబ్‌మేళా

కృష్ణా: ఈనెల 19న పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే మేళాలో కంపెనీలు పాల్గొని 570కుపైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతలతో 18-35 ఏళ్ల వారు హాజరుకావచ్చు. అభ్యర్థులు naipunyam.ap.gov.inలో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు .