హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాపూర్‌లో రోడ్డు ప్రమాదం

NLR: రాపూర్‌ పట్టణంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని తూర్పు అగీర్త కట్టకు చెందిన భూపతి శ్రీదేవి రోడ్డు దాటుతున్నారు. ఇదే సమయంలో రాపూరు నుంచి వెలుగోను వైపు వెళ్తున్న బైకు ఆమెను ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన శ్రీదేవి అక్కడికక్కడే మరణించారు. బైక్ నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.