హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయం: ఎమ్మెల్యే

KDP: కష్టాల్లో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం జమ్మలమడుగు క్లబ్లో 22 మంది లబ్ధిదారులకు రూ.19,79,702 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. నిరుపేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.