హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎరువులను సమతుల్యంగా వినియోగించాలి'

SKLM: ఆమదాలవలస (M)మునగవలసలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వై.వి.ఎస్. మురళీకృష్ణ పాల్గొని రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. పంటలకు ఎరువులను అవసరమైన మోతాదులో, సమతుల్యంగా వినియోగించాలని సూచించారు. పంటల్లో చీడపీడలు, తెగుళ్ల లక్షణాలను తొలిదశలోనే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలన్నారు.