హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భర్తకు తెలియకుండా భార్యకు అబార్షన్

PLD: వినుకొండ మండలం కొప్పుకొండకు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు తనకు తెలియకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లగా,బంధువులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. అక్కడ వైద్యులు అబార్షన్ చేశారనే విషయం ఆలస్యంగా తెలిసిందని వాపోయారు.