హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యాపారికి తోపుడు బండిని అందించిన ఎమ్మెల్యే

NTR: రెడ్డిగూడెంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ప్రతి సమస్యను ఓపికగా విని, పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. రుద్రవరంకు చెందిన కొమ్ము జయరాజుకు రూ.49వేల విలువైన LOCని అందజేశారు. చిరు వ్యాపారికి తోపుడుబండిని అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం లేకుండా చూడాలన్నారు.