CTR: గుడిపాల మండలంలో ప్రభుత్వ ఏటీఎం అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చిత్తూరు కో-ఆపరేటివ్ బ్యాంకు అధికారులు మొబైల్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. దీంతో నగదు అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బంది తప్పిందని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ ఏటీఎం సేవలను నిరంతరం కొనసాగించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుడిపాలలో కో-ఆపరేటివ్ మొబైల్ ఏటీఎం


