హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

కోనసీమ: మండపేటలో ఆరో తరగతి విద్యార్థి సిద్ధాంతపు గణేష్‌ (11) కాలువలో గల్లంతై మృతి చెందిన ఘటన విషాదం నింపింది. పల్లీలపేటకు చెందిన గణేష్‌ పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పెద్దకాలువ వద్ద గాలింపు చేపట్టారు. రాత్రి పెడపర్తి రేవు సమీపంలో గణేష్‌ మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి కారణాలను తెలుసుకుంటున్నారు.