హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాలలో విభూది గణపతి

BPT: చీరాలలో వినాయక చవితి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అమరావారి వీధిలోని శ్రీ అభయ గణపతి ఆలయంలో శ్రీ గణపతి బాలభక్త సమాజం 68వ వార్షికోత్సవం సందర్భంగా 6,200 విభూది, చందనం గడ్డలతో 10 అడుగుల గణపతి ప్రతిష్ఠించారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు.