హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఆత్మకూరులో మంత్రి ఆనం పర్యటన

NLR: రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం ఆత్మకూరు పట్టణంలో పర్యటించనున్నారు. పట్టణంలోని వినాయక విగ్రహాలు సమయానుకూలంగా నిమజ్జనానికి తరలిస్తూ వీడ్కోలు పలికే కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. మున్సిపల్ బస్టాండ్ వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుందన్నారు. మంత్రి కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు.