NLR: జిల్లాలో గణేష్ విగ్రహాల నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. ఈనెల 20 వరకు దాదాపుగా 3,326 విగ్రహాలు నిమజ్జనం కానున్న నేపథ్యంలో 16,18,20 తేదీల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'గణేష్ నిమజ్జనాలకు పటిష్ట బందోబస్తు'


