హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంట పుట్టిస్తున్న ఉల్లి ధర

KKD: పెద్దాపురం డివిజన్‌లో ఉల్లి ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే ఉల్లి అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, క్షేత్రస్థాయిలో ఇంకా అమలు కాలేదు. ప్రస్తుతం చిల్లర మార్కెట్లో నాణ్యమైన ఉల్లి కిలో రూ.75 నుంచి రూ.85 పలుకుతోంది. ప్రభుత్వం ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.