హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిలిండర్ల పంపిణీని సక్రమంగా చేపట్టాలి: జేసీ

W.G: ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని సక్రమంగా, పారదర్శకంగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీలు, అధికారులతో ఆమె మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆధార్, ఈకేవైసీ, ఎన్పీసీఐ మ్యాపింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సబ్సిడీ జమ వివరాలను లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు.