NLR: కోవూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఓజోన్ దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయి వేబినార్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ సుజాత ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల వరకు ఈ వేబినార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓజోన్ పొరపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కోవూరులో జాతీయస్థాయి వేబినార్


