హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

అన్నమయ్య: రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. రాయుడు కాలనీ, వినాయక నగర్, కృష్ణాపురం, తిరుపతి నాయుడు కాలనీ, కొత్తపేట, లక్ష్మీపురం, ఇందిరమ్మ కాలనీల్లో సీసీ డ్రైన్లు, రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.