హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో ముసాయిదా పోలింగ్‌ స్టేషన్లు ఇవే!

NTR: నందిగామలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మండల ముసాయిదా పోలింగ్‌ స్టేషన్ల జాబితాను మంగళవారం విడుదల చేసినట్లు కమిషనర్‌ జి.లోవరాజు తెలిపారు. 14 గ్రామాల్లో 47 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మండలంలో 39,224 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఈ నెల 16లోగా ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలని సూచించారు.