హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె

కృష్ణా: వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండల వీఆర్ఏలు ఈ నెల 16వ తేదీ నుంచి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఇన్‌చార్జ్ తహసీల్దార్ సీహెచ్ చిట్టిబాబుకు మెమొరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రసన్న, జనరల్ సెక్రటరీ దీప్తి, ట్రెజరర్ అరుణ పాల్గొన్నారు.