హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమేశ్వరం మాజీ సర్పంచ్‌కు YCPలో పదవి

కోనసీమ: రాయవరం మండలం సోమేశ్వరం మాజీ సర్పంచ్ ఆరిఫ్‌ను మండపేట నియోజకవర్గ YCP యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించారు. ఈ విషయాన్ని ఆరిఫ్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. YCP అధినేత YS జగన్ ఆదేశాలతో MLC తోట త్రిమూర్తులు తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించారని తెలిపారు. పార్టీ పటిష్ఠతకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆరిఫ్ పేర్కొన్నారు.