KDP: ప్రొద్దుటూరు గౌరమ్మ కట్ట వీధిలోని కొవ్వూరు గ్యారేజీ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కొందరు యువకులు నడిరోడ్డుపై గొడవపడుతూ అలజడి సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇటీవల జేఎండీ రోడ్డులో బార్ వద్ద విద్యార్థుల ఘర్షణ, రైల్వే స్టేషన్ సమీపంలో యువకుల పరస్పర దాడులతో వరుస ఘటనలు చోటుచేసుకోవడంతో పట్టణవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నడిరోడ్డుపై యువకుల గొడవ


