హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య

KDP: CK దీన్నే (M) కృష్ణాపురానికి చెందిన లారీ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారి రాగినూతుల రెడ్డయ్య (45) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఇంటి నిర్మాణంతో అప్పులు పెరగడంతో పాటు దంపతుల మధ్య కలహాలు జరుగుతున్నట్లు సమాచారం. మంగళవారం భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో బెడ్రూమ్‌లో ఉరివేసుకుని మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.