హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాసవి మాతకు వెండి పాదపీఠం బహూకరణ

KDP: వేంపల్లిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో వాసవి మాతకు ప్రొద్దుటూరుకు చెందిన భక్తుడు మంగళవారం మిట్టా శ్రీనివాసులు వెండి పాదపీఠాన్ని బహూకరించారు. రూ.73 వేల విలువైన 320 గ్రాముల వెండి పాదపీఠాన్ని ఆలయానికి అందజేసినట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోటంశెట్టి చంద్రశేఖర్ తెలిపారు. దాతల సహకారంతోనే ఆలయ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.