VSP: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆనందపురం ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు. మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు గాను 63 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితా ప్రచురించినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం


