హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మెగా జాబ్ మేళా

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం మోడల్ కెరీర్ సెంటర్ (యూఈఐ అండ్ జీబీ) ఆధ్వర్యంలో బుధవారం మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ చీఫ్ కె. దొరబాబు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ (మెకానికల్/ఆటోమొబైల్) అర్హతలు కలిగి 18 నుంచి 35 ఏళ్ల వయసున్న పురుషులు, మహిళలు ఈ మేళాకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు విద్యార్హత పత్రాలతో రావాలన్నారు.