హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2026 ఏడాదిలో ఇప్పటివరకు 892 పరుగులు సాధించి, భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ (2022లో 1164 పరుగులు) అగ్ర స్థానంలో ఉండగా, అభిషేక్ శర్మ (2025లో 859 పరుగులు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.