హైదరాబాద్: 28°C
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్.. జట్టులోకి పంత్, హార్దిక్ పాండ్య!

వెస్టిండీస్‌తో భారత్‌లో జరిగే సిరీస్‌ల కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బుధవారం దిల్లీలో సమావేశం కానుంది. సెప్టెంబరు 27 నుంచి మూడు వన్డేలు, అక్టోబర్ 6 నుంచి ఐదు టీ20లు జరగనున్నాయి. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యతో పాటు, కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా రిషబ్ పంత్ వన్డే జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలున్నాయి.