SRD: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిన్నారం మున్సిపల్ కార్మికులు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఆరు నెలలుగా జీతాలు రాక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని సీఐటీయూ నాయకుడు నాగేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వేతనాలు చెల్లించి కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
మున్సిపల్ కార్మికుల ధర్నా


