హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నదానం ఎక్కడో ఈజీగా తెలుసుకోండి

HYD: వినాయక చవితి నవరాత్రుల వేళ నగరంలో అన్నప్రసాదం అందించే కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు ‘Annadhanam Spots’ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఉచిత పోర్టల్‌లో సమీపంలోని అన్నదాన కేంద్రాల లొకేషన్, సమయాలను తెలుసుకోవచ్చు. ప్రజలు తమకు తెలిసిన అన్నదాన కేంద్రాల వివరాలను కూడా నమోదు చేయవచ్చు. హాస్టలర్లు, బ్యాచిలర్లకు ఇది ఉపయోగకరంగా మారనుంది.