KMM: వైరా వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్ల నిర్వహణపై మార్కెట్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఛైర్మన్ బోళ్ల గంగారావు, వైస్ ఛైర్మన్ సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు, వ్యాపారులతో చర్చించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని, గిట్టుబాటు ధర అందేలా చూడాలని సూచించారు. మార్కెట్‌లో తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
తెలంగాణ
వైరా మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లపై సమీక్ష


