హైదరాబాద్: 28°C
తెలంగాణ

లేబర్ సెల్ కన్వీనర్‌గా నాయికోటి శ్యామయ్య

MDK: బీజేపీ లేబర్ సెల్ మెదక్ జిల్లా బాధ్యతలను నాయికోటి శ్యామయ్యకు అప్పగించారు. హైదరాబాద్‌లో రాష్ట్ర కన్వీనర్ ఆందె శ్రీనివాస్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్యామయ్య మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. ఈ నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.