హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

BHPL: వెంకటేశ్వర్లపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పడిదెల భాస్కర్‌ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, పాఠశాల ప్రగతికి ఆయన చేస్తున్న కృషిని గ్రామస్థులు కొనియాడారు. సర్పంచ్‌ సరిత–యుగేందర్‌, ఉపసర్పంచ్‌ రాజుతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్థులు భాస్కర్‌ను అభినందించారు.