MBNR: బాలానగర్ మండలం అప్పాజీపల్లి గ్రామంలో మంగళవారం ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థుల హాజరు, పౌష్టిక ఆహార అందజేతపై ఆరా తీశారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్ నాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో


