హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్పొరేషన్ల హామీపై మాజీ ఎంపీపీ ఫైర్

WGL: ఆదివాసీ, ఎరుకల కులాలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ డాక్టర్ సారంగపాణి విమర్శించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు నల్లబెల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హామీ అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలను తండాల్లోకి రానివ్వమని ఆయన హెచ్చరించారు.