JGL: కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని పట్టణ, మండలానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు రూ.8.50 లక్షల చెక్కులను ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ అందజేశారు. వైద్య ఖర్చులతో ఇబ్బంది పడే పేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగకరమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తామన్నారు.
తెలంగాణ
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే


