హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్ వ్యవస్థ

హైదరాబాద్‌లోని మెట్రో జోన్‌లో విద్యుత్ వైర్లను భూగర్భంలోకి మార్చేందుకు భారీ ప్రణాళిక రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా 300 కి.మీ 33 కేవీ, 30,000 కి.మీ 11 కేవీ లైన్లను భూగర్భ కేబుళ్లుగా మార్చనున్నారు. దీనివల్ల ఈదురుగాలులు, వర్షాల వల్ల కలిగే విద్యుత్ ఆటంకాలు తగ్గుతాయి. రెండేళ్ల లక్ష్యంతో త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.