హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'

MHBD: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ గూడూరు మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు రాంబాబు నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న కార్యక్రమాల గురించి చర్చించారు.