హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అంబేద్కర్‌ను అవమానిస్తే చర్యలు తీసుకోవాలి'

BHPL: చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్‌ను అవమానించేలా పుస్తకం రాసిన హమారా ప్రసాద్‌పై, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.