హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇసుక రీచ్ నిలిపివేయాలని వినతి

KDP: ఇసుక రీచ్లో లోతుగా తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ రైతులు వేంపల్లిలో మంగళవారం ఆందోళన చేపట్టారు. అనుమతుల ప్రకారం మూడు అడుగులమేర మాత్రమే తవ్వాల్సి ఉండగా, సుమారు 10 అడుగులలోతు వరకు తవ్వకాలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఇసుక రీచ్ను వెంటనే నిలిపివేసి తమ పంటలు, భూగర్భ జలాలను కాపాడాలని కోరుతూ రైతులు వేంపల్లి తహసీల్ధార్‌కు వినతిపత్రం సమర్పించారు.