హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెచ్ఎం మృతి పట్ల విద్యార్థుల సంతాపం

KMR: బిక్కనూర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనాథ్ గుండెపోటుతో మృతిచెందడంతో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు కంటతడి పెట్టారు. విద్యా భివృద్ధికి శ్రీనాథ్ ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.