హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంజీఎం జంక్షన్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన

WGL: నగరంలోని MGM సెంటర్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యలపై అధికారుల నుంచి స్పందన కరువైందంటూ ఆగ్రహం వ్యక్తంచేసి ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.