హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కోదాడలో జాబ్ మేళా'

SRPT: ఉత్తమ్ దంపతులు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కోదాడ పట్టణంలో ఈనెల 19న జాబ్ మేళా నిర్వహిస్తున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఆరోపించారు. కోదాడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో విఫలమైన ప్రభుత్వం.. ప్రైవేటు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తోందన్నారు.