హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయ ఆవరణలో మృతదేహం కలకలం

భద్రాద్రి: ఏటూరునాగారం బస్టాండ్‌ సమీపంలోని గ్రంథాలయ ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడితో ఓ యువతి ఉన్నట్లు, వారిద్దరూ బొగత జలపాతం వెళ్లి వచ్చినట్లు స్థానికుల నుంచి సమాచారం అందింది. మృతుడు మణుగూరుకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.