హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MPTC, ZPTC పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల

PPM: కురుపాం ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాలు, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను మంగళవారం ప్రచురించినట్లు ఎంపీడీవో ఉమామహేశ్వరి తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో జాబితాలపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు వీటిని పరిశీలించి అభ్యంతరాలు తెలపాలని కోరారు.