హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు పరిహారం అందజేసిన ఎమ్మెల్యే

JGL: విద్యుత్ షాక్‌తో మృతి చెందిన తిప్పన్నపేటకు చెందిన చింతకుంట రాజ నర్సయ్య, జగిత్యాల బుడగ జంగాల కాలనీకి చెందిన సిరిగిరి ఎల్లవ్వ కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల చొప్పున విద్యుత్ ప్రమాద పరిహారాన్ని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు. ఒక్కొక్కరికి రూ.50 వేల చెక్కు, రూ.4.50 లక్షల బాండ్ ను క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.