గద్వాల: తమపై మోపుతున్న విపరీతమైన పనిభారాన్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గద్వాల కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం బైఠాయించి నిరసన తెలిపారు. అదనపు బాధ్యతలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు.
తెలంగాణ
పనిభారం తగ్గించాలని కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీల నిరసన


