WG: ఆచంట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎస్. కృష్ణమోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, పార్టీ నాయకులు అనుసరించాల్సిన నిబంధనలు, ఓటర్ల జాబితా తదితర అంశాలపై సమావేశంలో నాయకులతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఆచంటలో అఖిలపక్ష సమావేశం: MPDO


