హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి: దండి లక్ష్మి

SDPT: హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో 17వ వార్డులో సఫాయి అప్నా భీమారీ భగావో కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చైర్ పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ.. పట్టణ ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని సూచించారు.