ఖమ్మం: నగరానికి చెందిన షేక్ యాసిన్‌కు టీపీసీసీ సోషల్ మీడియా విభాగంలో రాష్ట్ర స్థాయి బాధ్యత లభించింది. రాష్ట్ర సోషల్ మీడియా ఛైర్మన్ పెట్టెం నవీన్ ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను డిజిటల్ వేదికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని యాసిన్ తెలిపారు. నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు చెప్పారు.
తెలంగాణ
TPCCలో యాసిన్‌కు కీలక పదవి


