PLD: సత్తెనపల్లిలో కట్టమూరివారి వీధిలో ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామాలయ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏకంగా 2 టన్నుల బెల్లంతో భారీ విగ్రహాన్ని వినూత్నంగా రూపొందించి ప్రతిష్ఠించారు. భక్తులకు ఆరోగ్యం, మాధుర్యం పంచాలనే పవిత్ర సందేశంతో ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. బెల్లంతో రూపొందించిన తీపి గణపయ్యను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
సత్తెనపల్లిలో నోరూరించే ‘బెల్లపు గణపతి’


